శశి జూనియర్ కళాశాల, తణుకు , గౌరవ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి సుంకర శ్రీదేవి ఆదేశాల మేరకు, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి K. కృష్ణ సత్యలత కాలేజీ పిల్లలకు అవగాహన కల్పిస్తూ ప్రతి విద్యార్థి చదువుకునే సమయం నుండే క్రమశిక్షణ కలిగి కస్టపడి చదువుకుంటే అనుకున్న పనులు సాధించవచ్చని, ప్రస్తుతం పిల్లలు చదువులో ముందుకు పోతున్నారని, అలాగే సమాజం లో జరిగే మోసాల పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు, food safety అధికారి డాక్టర్ శ్రీ K. శ్రీధర్ రెడ్డి, మాట్లాడుతూ , ఆహార పదార్థాలు కల్తీ పై అవగాహన కలిగి ఉండాలని, ఆహారకల్తి చేస్తున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1915 తెలియ చేయాలని, కొంతమంది అక్రమ సంపాదన కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, పాలు దగ్గర నుండి నూనె, పప్పులు, ఉప్పులు వరకు కల్తీ జరుగుతుందని తెలిపారు, శ్రీమతి పోణంగి శ్రావణి సమీర మాట్లాడుతూ, పిల్లలు జంక్ ఫుడ్ తగుమాత్రమే తీసుకోవాలని, జంక్ ఫుడ్ లలో ఆరోగ్యాన్ని పాడుచేసే గుణాలు ఎక్కువ అని తెలుపుతూ, ఆక్కడ వున్న ఆడపిల్లలు, మగ పిల్లలకు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు దానివలన మంచి చెడు తెలుస్తుందన్నారు, టీనేజ్ పిల్లలు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, వాటిని సేవించటం, అమ్మటం, తయారుచేయుట నేరమని తెలిపారు, శ్రీ కౌర్ వెంకటేశ్వర్లు సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సర లోపు పిల్లలు మోటారు వాహనాలు నడుపకూడదని, సరైన డ్రైవింగ్ లైసెన్స్, బండి ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, మైనర్ బాలలు ఏదైనా ఆక్సిడెంట్ చేస్తే తల్లిదండ్రులు శిక్షకు గురి కావలసి వస్తుందని తెలిపారు, శ్రీ నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్, కాలేజీ ఇంచార్జి ఇలాంటి మంచి కార్యక్రమము వారి కాలేజీలో నిర్వహించినందుకు అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి K కృష్ణ సత్యలత, న్యాయవాదులు శ్రీ కౌర్ వెంకటేశ్వర్లు, శ్రీమతి పోణంగి శ్రావణి సమీర, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీ K శ్రీధర్ రెడ్డి, కాలేజీ ఇంచార్జ్ శ్రీ నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్, పారా లీగల్ వాలంటీర్ లు శ్రీ కాకర్ల నరసన్న, శ్రీమతి M శ్రీదేవి, శ్రీ దూలపల్లి బ్రహ్మాజీ, A సుజాత, G అజోర్, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.


