నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో ఉన్న షాదీ ఖానాలో నిడదవోలు నియోజకవర్గం సంబంధించిన మూడు మండలాల వ్యవసాయ మరియు ఉద్యాన సహాయకులు, ఎరువుల డీలర్స్ మరియు సొసైటీ వారికి (APIMS 2.O ) ఏపీ. ఐ. ఎం. ఎస్. యాప్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది ఈ సదస్సులో కొవ్వూరు సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సి.హెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్ జూన్ 8 వ తారీకు నుండి రైతులకు యూరియా మరియు డిఏపి ఎరువులను ఏపీ ఐఎంఎస్ యాప్ ద్వారా మాత్రమే అందించాలని ఆ యాప్ లో రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు వేశారు దానికి ఎంత యూరియా, డిఏపి అవసరం అవుతుంది అనే విషయాలు ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయని దీని ద్వారానే రైతులకు కావలసిన ఎరువులను వారి ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేసి రైతులకు ఎరువుల సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా ఎరువులు వ్యవసాయేతర వినియోగం కోసం పక్కదారి పట్టకుండా వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే కొరత లేకుండా అందేటట్లు చూడటం కోసమే ఈ యాప్ను రూపొందించారని దీని ద్వారా రైతుకు కేటాయించిన ఎరువు వేరే ఎవరు తీసుకోకుండా వారికి మాత్రమే అందేటట్లు ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం వ్యవసాయాధికారి బి.రాజారావు మాట్లాడుతూ ప్రతి రైతు ఈ యాప్ సెల్ ఫోన్లు లో డౌన్లోడ్ చేసుకోవాలని దీనిలో రైతుకు కావలసిన వ్యవసాయానికి సంబంధించి అన్ని విషయాలు ఉంటాయని వారి పొలం విస్తీర్ణం, వారు వేసిన పంటలు, దానికి వేయవలసిన ఎరువులు, సస్యరక్షణ, వాతావరణం వంటి అనేక విషయాలు ఫోన్ నుండే చూసుకొని వారికి కేటాయించిన యూరియా, డి.ఎ.పి. వివరాలను కూడా రైతు తెలుసుకోవచ్చని దీని ద్వారానే వారికి కేటాయింపులు ఎరువులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతులు ఈ యాప్ లో తమ పంట వివరాలు చూసుకొని ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే తమ గ్రామ వ్యవసాయ సహాయకులతో మాట్లాడి వారి వివరాలు సరి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణ మాట్లాడుతూ ఎరువుల డీలర్స్ సొసైటీ వారు రైతులకు ఎరువులు అమ్మే ముందు ఈ యాప్ లో రైతుకు కేటాయించబడిన ఇరువు వివరాలను చూసుకుని దానిని ఈ పాస్ ద్వారా రైతులకు అందజేయాలని రైతు వివరాల్లో ఏ విధమైన పొరపాట్లు కనిపించినట్లైతే సంబంధిత రైతు సేవా కేంద్రం వారికి తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేతీకో బచావో అనగా భూమిని కాపాడండి అనే నినాదంతో భూసారాన్ని పరిరక్షించడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలను రసాయనిక ఎరువులను తగ్గించి సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు వివరించవలసిన విషయాలను తెలియజేశారు.



