తణుకు నియోజకవర్గం, ఇరగవరం మండలం, కొత్తపాడు గ్రామంలో సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అనే నినాదంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు ప్రజాల ఆరాధ్యదైవం తెలుగువారి కీర్తి ప్రతిష్టలు ఖండంతరాలు చాటిన చెప్పిన ఘనుడు తెలుగువారి గుండె చప్పుడు ఆంధ్రుల అన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా ఎన్.టి.ఆర్. విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపాడు సొసైటీ అధ్యక్షులు కారెం బాబురావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి గల్లి నుంచి ఢిల్లీ వరకు తెలుగువారి సత్తా చాటిన మహాయోధుడు ప్రజల సంక్షేమం కొరకు కూడు,గూడు,గుడ్డ, అందరికీ అందాలి అనే ఉద్దేశంతో కిలో రెండు రూపాయలు బియ్యం, మహిళలకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం, వృద్ధులు వితంతువులు వికాలాంగులకు పెన్షన్ పథకం, ఈ దేశంలో మొట్టమొదట అమలుచేసిన వ్యక్తి అన్న ఎన్.టి.ఆర్. పరిపాలన సౌలభ్యం కోసం మండల వ్యవస్థను ప్రవేశపెట్టి పరిపాలన సులభతారం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు, దండు గణపతిరాజు, సెక్రటర్ నేకూరి ప్రసాద్, బొక్క రామకృష్ణ, నీటిసంఘం డైరెక్టర్స్ సిరిశెట్టి శ్రీను, వేండ్ర సత్యనారాయణ, జనసేన అధ్యక్షులు చిట్టూరి సత్యనారాయణ, మైపాలా పండు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు



