విద్యుత్ సంస్కరణలలో చంద్రబాబునాయుడు పాత్ర అమోఘం

దూర దృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు

గత ఐదేళ్ల కాలంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి

మహానాడు మొదటి రోజు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

విద్యుత్ సంస్కరణలపై తీర్మానం బలపరిచిన ఎమ్మెల్యే

రాష్ట్రాన్ని దూర దృష్టితో అభివృద్ధి చేస్తూ యువత ఆశలకు ప్రతిరూపంగా దార్శనిక నాయకులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిలుస్తారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. విద్యుత్తు రంగ సంస్కరణలు- ట్రూ డౌన్ చార్జీలు అమలుపై తీర్మానాన్ని బలపరుచుతూ బుధవారం ప్రారంభమైన మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. విద్యుత్ సంస్కరణలో చంద్రబాబు నాయుడు పాత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. రాష్ట్రంలో 5 వేల మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అయ్యేదని ప్రస్తుతం విద్యుత్తు సంస్కరణలు తీసుకువచ్చి విద్యుత్ రంగంలో కొంత కొత్త పుంతులు తెచ్చారని అన్నారు. ప్రస్తుతం 11 వేల మెగావాట్ల ఉత్పత్తికి తీసుకు వెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు కు దక్కుతుందని అన్నారు. 1998లో ఏపీ ఎలక్ట్రిసిటీ రీఫాం యాక్ట్ తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కం ఏర్పాటు చేసి రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని వ్యవస్థీకృతం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు అనే కొనియాడారు. 2014లో రాష్ట్ర విభజన పరిస్థితుల్లో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఏర్పడిన రాష్ట్రంలో తిరిగి చంద్రబాబు నాయుడు తన సమర్థమైన నాయకత్వంతో 24 గంటలు విద్యుత్తు సరఫరా చేసే విధంగా 2019 నాటికి ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్తు అందించే విధంగా ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు. 2014- 19 కాలంలో మరో 10 వేల మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచే సోలార్, పవర్ విండ్ ద్వారా అత్యధిక ఉత్పత్తి చేసే విధంగా సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. తిరిగి 2019లో దురదృష్టవశాత్తు ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటికీ అప్పుడు అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తిని నిరోధించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ట్రూ అప్ చార్జీల పేరుతో సామాన్య ప్రజల పై భారాన్ని మోపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. టారిఫ్ లు పెంచి రాష్ట్ర ప్రజలపై రూ. 32 వేల కోట్ల భారాన్ని మోపారని ఆరోపించారు. విద్యుత్తు సంస్థల పైన రూ. 49 వేల కోట్ల భారాలు మోపారని అన్నారు. విద్యుత్తు రంగానికి 1.29 లక్షల కోట్ల నష్టాన్ని విద్యుత్ రంగంలో కలిగించారని అన్నారు. తిరిగి 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ఐదేళ్లపాటు విద్యుత్తు చార్జీలు పెంచమని విద్యుత్ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో 1.30 కోట్లు కుటుంబాలకు కోటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే రాధాకృష్ణ పేర్కొన్నారు.

Scroll to Top
Share via
Copy link