తణుకు పురుషుల గ్రంధాలయంలో సోమవారం ప్రపంచ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ను పురస్కరించుకుని వేసవి శిక్షణశిబిరం యందు శిక్షణ పొందుచున్న విద్యార్ధిని/విద్యార్ధులకు గ్రంథాలయ అభివృధి కమిటీ అధ్యక్షులు శ్రీమతి వావిలాల సరళదేవి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల యెడల తల్లితండ్రులు శ్రద్ధ వహించాలని, ఆర్ధిక పరిస్థితుల వల్ల కూడా పిల్లలు ఇళ్లనుండి పారిపోవుట, చదువు మీద శ్రద్ధలేఖ, తల్లితండ్రుల ప్రవర్తన ద్వారా ఇంటినుండి వెళ్ళిపోవుటా జరుగుతుందని, సీనియర్ న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల యెడల ప్రేమ కలిగి ఉండాలని, వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఇంటిలో ఆర్ధిక పరిస్థితులు ద్వారా పారిపోవుట జరుగుతుందని అలాంటివారు ఎక్కువగా, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ లలో, హోటళ్లలో, కర్మాగారాల్లో పనిచేస్తున్నారని అలాంటి వారిని గుర్తించి లేబర్ డిపార్ట్మెంట్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇస్తే వారిని ప్రభుత్వ వారిచే నిర్వహించూ హోమ్ లలో ఉంచి వారి తల్లిదండ్రులను గుర్తించి వారికి పిల్లలను అప్పచెప్పుతారని తెలిపారు. లేబర్ ఆఫీసర్ బి. లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 14 సంవత్సరలోపు పిల్లలు చదువుకోవాలని, కొన్ని ముఠాలు పిల్లల్ని కిడ్నాప్ చేసి వారిని అవిటీ వారిగా చేసి బెగ్గింగ్ చేయించుట, అక్రమరవాణా చేయడం జరుగుతుందని, అపరిచితుల మాటలు నమ్మకూడదని, వారే మాయ మాటలు చెప్పి పిల్లల్ని కిడ్నాప్చేస్తారని తెలిపారు, సమస్య ఎదురైతే వెంటనే పోలీసు టోల్ ఫ్రీ నం.100, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098 , జాతీయ న్యాయ సేవల సంస్థ, ఢిల్లీ వారి టోల్ ఫ్రీ నంబర్ 15100 కు తెలియ చేయాలన్నారు, కార్యక్రమంలో న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన మునిస్వామి, లేబర్ అధికారి లక్ష్మణ్ కుమార్, పారాలీగల్ వాలంటీర్ లు కాకర్ల నరసన్న, శ్రీమతి ఎం. శ్రీదేవి, లైబ్రేరియన్ జి. కృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.



