పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు
పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, జిల్లా మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసానికి విచ్చేశారు.
ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ మంతెన రామరాజు, నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయకర్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వలవల బాబ్జి, నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రామరాజు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం వంటి పలు అంశాలపై చర్చించారు. అలాగే స్థానిక సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను మంత్రులు, ప్రజాప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



