మోర్తలో ఘనంగా హనుమజయంతి అన్నసమారాధన

మోర్తగ్రామంలో కొత్తపేట వద్ద వేంచేసియున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద మంగళవారం హనుమ జయంతి సందర్భంగా ఘనంగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మంత్రి దుర్గేష్ ను శాలు వాతో సత్కరించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. పరిసర గ్రామాల నుండి భారీగా మహిళలు, యువకులు తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మారిశెట్టి అంజి, చిటికిన మోహనరావు, తాళం చిన్న, రాచమళ్ళ నాగరాజు, రాచమళ్ళ పోతురాజు, వెలిగట్లప్రభువరం, కొమటిశ్రీను, కొనకళ్ళ మోహన్, గణేష్ మాట్లాడుతూ సుమారు 6,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని ప్రతి ఏటా జరిగే ఈ వేడుకలో మామిడి పండును ప్రసాదంగా భక్తులకు అందించడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండల టిడిపి అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, తూ.గో.జిల్లా జిల్లా టిడిపి బిసి నాయకులు రాచమళ్ళ శ్రీనివాస్, మోర్త గ్రామ టిడిపి నాయకులు కంటిపూడి ప్రసాద్, కంటిపూడి నరేంద్ర, జలమయ్య, సొసైటీ చైర్మన్ దొరబాబు, చౌదరి, జనసేన పార్టీ నాయకులు దాసరి సుబ్రహ్మణ్యం, మల్లుల గాంధీ, మెల్లా రాము తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link