గన్నమని జన్మదినం సందర్భంగా ఉచితంగా పుస్తకాలు పెన్నులు పంపిణీ

ఉండ్రాజవరం గ్రామంలో తాము అభిమానించే నాయకుని జన్మదినం సందర్భంగా మంగళవారం శ్రీ కోదండ రామా శెట్టిబలిజ సంఘ రామాలయం వద్ద ఉండ్రాజవరం గ్రామ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ నాయకులు,ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ బోర్డు మెంబర్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం జన్మదిన సందర్భంగా గ్రామ పురోహితులు శ్రీ జ్యోశ్యుల సుబ్రహ్మణ్యంచే కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం, అనంతరం ఉచితంగా 100 మంది బాలబాలికలకు పుస్తకాలు, పెన్నులు  తమ నాయకుని చేతులమీదుగా అందజేశారు గన్నమని అభిమానులు. భారీ కేక్ కటింగ్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బొక్క వెంకటేశ్వర్లు, సానబోయిన చంద్ర కృష్ణ, బొక్క కొండయ్య, బొక్క బాలకృష్ణ, కోన జయ నాగ వెంకటేష్, టేకి వీరభద్రం, జుత్తిగ రామాంజనేయులు, గుబ్బల సత్యనారాయణ, కడలి చిన్న శ్రీనివాస్, కోన వీర కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link