ఉండ్రాజవరం (అక్షరభూమి) 40 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నా లేకపోయినా గన్నమని కుటుంబాన్నిఆదరిస్తూ, తమ వెంట నడుస్తున్న వివిధ సామాజిక వర్గాలకు చెందిన సంఘ పెద్దలకు, యువకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని నిడదవోలు నియోజకవర్గం టిడిపి నాయకులు, ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీఫెడరేషన్ బోర్డు మెంబర్ గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం తెలియజేశారు. మంగళవారం తన జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుండి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులకు, పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదములు తెలిపారు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం. ఈ సందర్భంగా మండలంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఆయనకు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జన్మదిన వేడుకల్లో ఉండ్రాజవరం మండల టిడిపి అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా బీసీ నాయకులు రాచమళ్ళ శ్రీనివాస్, ఉండ్రాజవరం సొసైటీ చైర్మన్ గన్నమని రాము, తాడిపర్రు గ్రామ మాజీ సర్పంచ్ కరటూరి నరేంద్రబాబు, తూర్పుగోదావరి జిల్లా బిజెపి నాయకులు అక్కిన గోపాలకృష్ణ, ఉండ్రాజవరం మండల జనసేన పార్టీ నాయకులు వీరమళ్ళ బాలాజీ, కాకర్ల కరుణాకర్, పసుపులేటి ఇంద్ర, మండల బిజెపి అధ్యక్షులు కొప్పినీడి సత్యనారాయణ, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, పి.వి.రాము, తలపాగల శ్రీనివాస్, టేకి లక్ష్మణరావు, కోన జయ, కోట వెంకట్రావు, పెనుమాల నాగేశ్వరరావు, కుంచె కాంతారావు, నందిన రమేష్, పాతూరి నరేంద్ర, ఉండ్రాజవరం, తాడిపర్రు, మోర్త వెలగదుర్రు, చివటం గ్రామ టిడిపి నాయకులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



