- వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎస్సీలపై అన్యాయాలతో అనేక అక్రమాలకు పాల్పడి దౌర్జన్యకాండ హత్యా రాజకీయాలతో నిర్వహించారని పశ్చిమగోదావరి జిల్లా టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షుడు మజీ జడ్పిటీసి చుక్కా సాయిబాబు విమర్శించారు. తణుకు టిడిపి కార్యాలయంలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ చేతుల మీదగా సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎస్సీ ముఖ్య నాయకుల సమావేశంలో సాయిబాబు మాట్లాడుతూ వైసిపి ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను అత్యంత దారుణంగా హింసించి హత్య చేసి అతని శవాన్ని ఇంటికి పార్సిల్ చేశారని, దళిత డాక్టర్ సుధాకర్ కోవిడ్ సమయంలో ఆనాటి వైసిపి ప్రభుత్వంన్ని మాస్క్ సరఫరా చేయలేకపోతున్నారని ప్రశ్నించినందుకు డాక్టర్ సుధాకర్ ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయించి పిచ్చివానిగా ముద్రించి బహిరంగ వేధింపులకు గురిచేసి అంతమొందించారని తెలిపారు. వైసిపి పాలల్లో ప్రశ్నించిన దళితులపై ఎస్సీ, ఎస్టి అట్రాసిటీ కేసులతో వేధించారని అనేకమంది దళిత నాయకులను కక్షపూరితంగా వేధించి హత్య రాజకీయాలు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన దౌర్జన్యం మారణకాండపై దళిత సోదరులకు తెలిసేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించి ప్రచారం నిర్వహించనున్నామన్నారు. ఈ సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పితాని మోహన్, తణుకు ఏఎంసి చైర్మన్ కొండేటి శివ, చదలవాడ నాని,టిడిపి నాయకులు కలిసితి దయానందమూర్తి, కొల్లి అప్పారావు,దిడ్ల రవికుమార్, మల్లిపూడి ప్రసాద్, నత్తా చంద్రశేఖర్, ఉప్పల పండు, ముప్పిడి నరసింహామూర్తి, శ్రీను, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.



