ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సన్నాహాలు

‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదంతో టోర్నమెంట్ నిర్వహణ

మే ఒకటి నుంచి తణుకులో పోటీలు ప్రారంభం

వివరాలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

యువతను ప్రభావితం చేసే విధంగా గంజాయి,డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండేందుకు వాటి వైపు యువత మరలకుండా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ మూడో దశ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు వెల్లడించారు. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు తణుకు నియోజకవర్గంలోని యువత ఈ క్రికెట్ టోర్నమెంట్ లో భాగస్వాములు చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. మొదటి స్థానంలో నిలిచిన విజేతలకు రూ. 60 వేలు, రెండో స్థానంలో నిలిచిన విజేతలకు రూ. 30వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 15 వేలు నగదు బహుమతితో పాటు వివిధ కేటగిరీల్లో కన్సోలేషన్ బహుమతులు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో యువతకు ప్రతి ఏటా మే నెలలో క్రికెట్ టోర్నమెంట్ నర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొని జట్టు సభ్యులకు స్పోర్ట్స్ కిట్ అందజేస్తామని తెలిపారు. ఈనెల 25 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయని మే 1వ తేదీ నుంచి టోర్నమెంట్ జరుగుతుందని చెప్పారు టోర్నమెంట్ లో పాల్గొనే జట్లు ప్రకారం మే నెల అంతా టోర్నమెంట్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని యువత తమ ప్రతిభను చాటుకునే విధంగా ప్రతి ఒక్కరు ఈ టోర్నమెంట్ లో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం క్రికెట్ టోర్నమెంట్ కు సంబంధించి బ్రోచర్లు, వెబ్ సైటును ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు.టోర్నమెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం: https://www.tanukuntrcricket.in/⁠ దీనిలో రిస్ట్ రావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link