భీమవరంలో బీజేపీ శ్రేణుల సమాలోచన

భీమవరం పగోజిల్లా కేంద్రం భీమవరంలో బీజేపీ శ్రేణులకు నిర్వహించిన మేధోమదన కార్యక్రమం  “సమాలోచన” శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అఖిల భారతీయ సహ సంయోజక్ “శ్రీ చంద్రకాంత్ శర్మ జి” (ప్రజ్ఞ ప్రవాహ్) పాల్గొనడమైనది. “చంద్రకాంత్ శర్మ జి”  లండన్ కేంద్రముగా విశ్వవిభాగ్ ప్రచార ప్రముక్ గా 15 సంవత్సరాలు, 20 దేశాలలో ముఖ్యంగా యూరప్, ఆఫ్రికా, మరియు అమెరికా దేశాలలో ప్రవాస్ గా సేవలందించారు. ఈ సందర్భంగా ఏ.పి.బిజేపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ ఈ కార్యక్రమం అనేక కొత్త విషయాలు ద్వారా తెలుసుకునే అవకాశం లభించినందుకు చాలా ఆనందాన్ని కలిగించిందని ఆమే తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మేధావులతో 2026 బడ్జెట్ పైన మేధోమధనం ద్వారా బి.జే.పి. నాయకులు, కార్యకర్తలు తెలుసుకున్నారు.

Scroll to Top
Share via
Copy link