గతం మరిచారా మాజీ మంత్రిగారూ – ఏఎంసి చైర్మన్ కొండేటి శివ

మద్యం కుంభకోణానికి పాల్పడింది వైసీపీ నేతలు

తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ విమర్శలు

మద్యం కుంభకోణానికి పాల్పడింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌మోహన్‌రెడ్డి అనుచరులు కాదా అని తణుకు ఏఎంసీ ఛైర్మన్‌ కొండేటి శివ ప్రశ్నించారు. సోమవారం తణుకు ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ధర్నా చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మేరకు సోమవారం కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హాయంలోనే నకిలీ మద్యం తయారు చేసి ప్రజలకు సరఫరా చేశారని గుర్తు చేశారు. కోవిడ్‌ సమయంలో నకిలీ మద్యాన్ని విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారని విమర్శించారు. అప్పట్లో ఎంతో మంది కిడ్నీ, లివర్‌ సంబంధిత వ్యాధులతో ఎంతో మంతి మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది మృతి చెందితే ఆనాడు మంత్రి హోదాలో ఉండి కారుమూరి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజల గురించి మాట్లాడే హక్కు కారుమూరికి లేదన్నారు. మద్యం కుంభకోణంలో కారుమూరి కుమారుడి పేరు కూడా తెరపైకి వచ్చిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నకిలీ మద్యం తయారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ప్రభుత్వ చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link