”నిడదవోలు నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన”
”రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి, ప్రజల ప్రాణాలు కాపాడాలి అని.నకిలీ మద్యం దందాపై సీబీఐతో దర్యాప్తు జరిగేలా చూడాలి అని నిడదవోలు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ జయరాజ్ సతీష్ కి వినతిపత్రం అందజేసిన నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు నిడదవోలు కొవ్వూరు పరిశాలికులు గిరజాల బాబు, పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మహిళా నాయకులు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ
🔴 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం రాష్ట్రం మొత్తం ఏరులై పారుతోంది
🔴 చిత్తూరు జిల్లా లో టిడిపి నాయకుడు వారి అనుచరులు నకిలీ మద్యం తయారు చేశారు
🔴 శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ఈ నకిలీ మద్యం తయారీ చేస్తున్నారు
🔴 టిడిపి నాయకులు నకిలీ మద్యం తయారీ చేసి.. బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నారు
🔴 మీ డబ్బులు కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు
🔴 ఎల్లో మీడియా ఈ నకిలీ మద్యం మకిలి వైఎస్సార్సీపీ పార్టీకి అంటగట్టాలని తప్పుడు వార్తలు రాస్తున్నారు
🔴 మా హయాంలో నకిలీ మద్యం తయారు చెయ్యలేదు
🔴 మహిళలకి మాట ఇచ్చి మద్యాన్ని కంట్రోల్ చేశాం
🔴 నాణ్యమైన మందు అని చెప్పి కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు
🔴 ఇప్పటికైనా నకిలీ మద్యం తయారు చేసేవారిని కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో నిడదవోలు, కొవ్వూరు పరిశీలకులు గిరజాల బాబు, పట్టణ అధ్యక్షులు కామిశెట్టి సత్తిబాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి సుబ్బారావు, పట్టణ మునిసిపల్ కౌన్సిలర్లు, మహిళా నాయకురాలు, వైఎస్ఆర్ సీపీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


