తణుకు పోలీసులచే అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

సెప్టెంబర్ నెల 26న తణుకు వారణాసి వారి వీధిలో వృద్ధురాలు వాకలపూడి కనకదుర్గను బెదిరించి 70 కాసులు బంగారు ఆభరణాలు, రూ. 70 వేలు నగదు అపహరణ చేసి పరారు అయ్యారు. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రతిస్టాత్మకంగా తీసుకున్న తణుకు పోలీసులు దర్యాప్తు చేపట్టి అనతికాలంలోనే చేదించారు. ఈ నేపద్యంలో తణుకు పట్టణ సిఐ ఎన్.కొండయ్య ఆధ్వర్యంలో ఆరు బృందాలను ఏర్పాటు చేసిన డిఎస్పి విశ్వనాధ్. సదరు కేసుకు సంబందించి మహారాష్ట్రకు చెందిన సందీప్ రామశంకర్ ఉపాధ్యాయ, మహమ్మద్ ఇక్బాల్ షేక్ తో పాటు రాజమండ్రి తాడితోటకు చెందిన మీసాల శ్రీనివాసరావు, నిమ్మకాయల శ్రీకాంత్, దుర్గాపు సత్యనారాయణ, దివ్వల యేసు, శ్రీకాకుళం చిన్నా, అంబటి రాజేష్, బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామానికి చెందిన గొర్రెపూడి వెంకటరమణ, తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లికి చెందిన కర్రీ సాయి చంద్రారెడ్డి లను అరెస్టు చేసి రిమాండ్ తరలించిన తణుకు పొలీసులు. ఈ సందర్భంగా తణుకు పట్టణ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో డిఎస్పి విశ్వనాధ్ మాట్లాడుతూ కేసు పూర్వాపరాలు వెల్లడించారు. వాకలపూడి కనకదుర్గ నివాసంలో అధిక మొత్తంలో డబ్బు ఉంటుందని భావించిన నిందితులు ఒక పథకం ప్రకారం దోపిడీ కి పాల్పడ్డారని, బాధితురాలు ఇచ్చిన సమాచారంతో త్వరితగతిన కేసు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు నిందితుల నుంచి సుమారు 30 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పి విశ్వనాధ్ వెల్లడి. నేరానికి పాల్పడిన అనంతరం నిందితులు ముంబాయి పారిపొయారు. నిందితుల కదలికలను ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించి అరెస్టు చేసిన పోలీసు శాఖ.

భారీ చోరీ కేసు దర్యాప్తులో సహకరించిన తణుకు పట్టణ, తణుకు రూరల్, సీఐలు ఎన్. కొండయ్య, బి. కృష్ణకుమార్, తాడేపల్లిగూడెం రూరల్ సీఐ బీబీ రవికుమార్ తో పాటు ఎస్ఐ.లు కె.శ్రీనివాస్, కె.ప్రసాద్, డి.ఆదినారాయణ, కె.చంద్రశేఖర్, పి.ప్రేమరాజులకు అభినందించిన డిఎస్పి విశ్వనాధ్. అదేవిదంగా చోరీ కేసు దర్యాప్తులో సహకరించిన ఎస్.శ్రీధర్, పి.సంగీతరావు, పి.సత్యనారాయణ, కానిస్టేబుళ్లు టి.రవి, డి.వెలగేశ్వరావు, పి.రాంబాబు, శివాజీ, అన్వర్, ఎం.శ్రీనివాస్, కె.శ్రీనివాస్, అక్బర్ లాల్ లను డీఎస్పీ విశ్వనాధ్ అభినందించారు.

Scroll to Top
Share via
Copy link