సంఘంలో జరిగిన అన్యాయాలను ప్రశ్నిస్తున్నానని, మహిళలకు న్యాయం చేస్తున్నానని కొందరు నాపై దురుద్దేశంతో అంబేద్కర్ బహుజన కార్యాలయం నడిపిస్తున్నానని నాపై బురద జల్లి నన్ను ఇబ్బంధులకు గురిచేయాలనీ చూస్తున్నారని పూలే అంబేద్కర్ బహుజన ఫౌండషన్ రాష్ట్ర చైర్మన్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు అన్నారు. మోర్త గ్రామము నుండి వేలివెన్ను వెళుతుండగా మార్గమధ్యంలో నన్ను కొందరు నాపై కుట్రతో దాడి చేయాలనే ఉద్దేశంతో వెంబడించారని, అక్కడున్న స్థానికులు నేను వారిని ఎదుర్కొనే సమయంలో పారిపోవడంతో ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, నిందితులను గుర్తించి తనకు న్యాయం చేయాలని యార్లగడ్డ వెంకటేశ్వరరావు కోరారు. సమాజంలో అన్ని వర్గాలను, కులాలను మతాలను కలుపుకొని వెళ్లే తనపై ఇటువంటి దాడులకు దిగటం బాధాకరమని వెంకటేశ్వరరావు అన్నారు.


