రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పి.మహేష్ ఆదేశాల నేపధ్యంలో డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అత్తిలి మండలంలోని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, లక్ష్మీవెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ ఎరువులు, పురుగుమందులు దుకాణాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో భాగంగా షాపులలో ఎరువుల నిల్వలను ఈ- పాస్ నిల్వలను తనిఖీ చేయడం జరిగింది. అదేవిదంగా ఎరువుల డీలర్లు అందరూ ఎరువుల నిల్వలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ ఎస్సై కే.సీతారాము, వ్యవసాయాధికారి టి.రాజేష్ వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.


