వైసీపీ డిజిటల్‌ బుక్‌ హాస్యాస్పదం

రాష్ట్రంలో సమస్యలపై హైదరాబాదు నెంబర్‌ ఇవ్వడం ఏంటి

గత వైసీపీ హయాంలో దాడులపైనా ఫిర్యాదు చేస్తాం

జీఎస్టీ 2.0తో పేద ప్రజల్లో సర్వత్రా హర్షం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన డిజిటల్‌ బుక్‌ హాస్యాస్పదంగా ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సమస్యలపై హైదరాబాదు నెంబర్‌ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ బెంగళూరులో నివాసం ఉంటూ రాష్ర సమస్యలపై హైదరాబాదు నెంబర్‌ ఇవ్వడం హాస్యాస్పదంగాఉందన్నారు. సోమవారం తణుకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాటాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టిడిపి, జనసేన శ్రేణులపై వైసీపీ చేసిన దాడులను సైతం డిజిటల్‌ బుక్‌ ద్వారా ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై జగన్‌మోహన్‌రెడ్డి ఎలా స్పందిస్తారో చూస్తామని చెప్పారు. గత ప్రభుత్వం జగన్మోహన్‌ రెడ్డి ప్రతి నెల నెల నిత్యవసర ధరలు పెంచే పరిస్థితి ఉండేది అన్నారు. కరెంటు, బస్సు చార్జీలు పెంచి మరోపక్క అభివద్ధిని దుర్వినిర్వియోగం చేశారన్నారు.
జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాలేజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మంట్‌ ఇవ్వకుండా రూ. 4 వేల కోట్లు బకాయి పెట్టి వెళ్లిపోయిన వ్యక్తి జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. కాలేజీ విద్యార్థులకు ఫీజు రూ. 4 వేల కోట్లు బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లించే దిశగా ముందుకు వెళుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 1200 కోట్లు ఒక దఫాగా మరో రూ. 400 కోట్ల రూపాయలను విడుదల చేసిందని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 16 వేల డీఎస్సీ పోస్టులను భర్తీ చేసిందని అన్నారు. వంద రోజుల్లో డీఎస్సీ నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. 15 నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. జీఎస్టీ గురించి ప్రజల్లో అవగాహన తెలిపే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలని అన్నారు. బాలకృష్ణ వాఖ్యలపై మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు ఎందుకు బాధ అని ప్రశ్నించారు. తమ పార్టీకు చెందిన వాళ్లం ఎన్నో అనుకుంటాం మళ్లీ మామూలుగా కలిసి ఉంటామని చెప్పారు. తప్పుడు ప్రచారాలు చేసి తగాదాలు పెట్టాలనుకోవద్దని సూచించారు. రాష్ట్రం భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించేందుకు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నారు. మరో 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండాలని వారి ముగ్గురి సారధ్యంలో ముందుకు వెళతామన్నారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link