ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వులు మేరకు ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి ఎస్. శ్రీదేవి తణుకు సబ్ జైల్ ను సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహార వసతి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు, పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపి, ప్రతి ఒక్క ముద్దాయి తనతరపున వాదించడానికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని తెలుపుతూ, ఎవరైనా ఆర్థిక స్తోమత లేక వారి తరపున న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేక పోతే న్యాయసేవల కమిటీ తణుకు వారి ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తారని తెలిపారు. వాయిదాలకు కోర్ట్ కు తీసుకెళ్ళని ముద్దాయిల కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జితో పాటు జిల్లా న్యాయ సేవాధికర సంస్థ జిల్లా సెక్రటరీ కే.రత్న ప్రసాద్, జైలు విజిటింగ్ న్యాయవాది కుమారి ఎస్.కె. మోతీ, పారా లీగల్ వాలంటీర్ కోనపల్లి అరుణ్ బాబు, జైలు సూపరింటెండెంట్ జి. మోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు.


