తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రోటరీ ఆడిటోరియంలో జరిగిన అధ్యక్షులు రొ. డాక్టర్ కలగర వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్థానిక ప్రముఖ ఆడిటర్ రో.జే.ఎస్.సుబ్రమణ్యం ముఖ్యవక్తగా పాల్గొని ప్రస్తుతం ప్రదానంశమైన జిఎస్టి కొత్త సవరణలు విధివిధానాలు అనే అంశంపై గణాంకాలతో సమావేశంలో పాల్గొన్న సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టాక్స్ ఆన్ టాక్స్ విధానం ఉండేది అని అనంతరం వ్యాల్యూ ఆడెడ్ టాక్స్ అంటూ మరొక స్థాయి పన్నుల విధానం జరిగేదని అన్నారు ప్రస్తుతం జీఎస్టీ నడుస్తూ ఉండగా కొత్త సవరణలతో అనేకంగా ఉన్న స్లాబ్ తీసివేసి రెండే రెండు రకాల స్లాబులు విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయం అమల్లోకి వచ్చిందని అన్నారు. ఈ కొత్త విధానంలో టాక్స్ తగ్గే వస్తువులు నెయ్యి సోప్స్ బిస్కెట్స్ బ్రెడ్ టూ వీలర్స్ కార్లు టీవీలు సిమెంటు ఏసీలు వగైరా ఉన్నాయని హెల్త్ ఇన్సూరెన్స్ పై జిఎస్టి పూర్తిగా తొలగించారని అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ డాక్టర్ కు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లకు జీఎస్టీ తొలగించారని తెలిపారు. జీఎస్టీ లో ఈ రెండు రకాల స్లాబులు లేకుండా ఒకే ఒక్క స్లాబ్ ఉంటే గజిబిజి లేకుండా ఉండేదని ఆడిటర్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి జి. సుధాకర్, రొటీరియన్లు మల్లిన రామచంద్రరావు, బోడపాటి గిరిప్రసాద్, కే.సిద్ధార్థ రాజు, మస్తాన్రావు, మళ్లిన అరుణాసారధి, వడ్లమాని పార్వతి, లహరి, పరిమి వెంకన్నబాబు, సత్యనారాయణరెడ్డి, నందిగం సుధాకర్, చిట్టూరి వెంకటేశ్వరరావు, మేడికొండ వెంకటేశ్వరరావు, సుబ్బారావు చింతలపూడి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.


