డీఎస్సీ నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగుల ‘మెగాకల’ కలను నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానం అమలులో భాగంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మెగా డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగ అభ్యర్థుల కల వేర్చి ఘనత సాధించిందన్నారు. డీఎస్సీ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ మేరకు తణుకు నియోజకవర్గంలో ఉద్యోగాలు సాధించిన 24 మందికి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ నియామక పత్రాలు అందజేసి వారిని అభినందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలనేది ఒక సెంటిమెంట్ అయ్యిందంటే దానికి కారణం డీఎస్సీ చరిత్ర చెబుతుందన్నారు. ఆ చరిత్రను కూటమి ప్రభుత్వం కొనగాస్తోందని చెప్పారు. అయిదేళ్ల పాటు వైస్సార్సీపీ అధికారంలో ఉండి కనీసం ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వంలో తమ కల నెరవేరిన వేళ ఉద్యోగ విజేతల్లో ఆనందం కనిపిస్తోందని ఎమ్మెల్యే రాదాకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్బంగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన తణుకు నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులను అభినందించారు.


