తణుకు మండలంలోని తేతలి, ముద్దాపురం ప్రాధమిక సహకార సంఘం అధ్యక్షులు మట్టా వెంకట్, ముళ్ళపూడి శ్రీనివాస్ ల అధ్యక్షతన ఖరీఫ్ 2025 ధాన్యం సేకరణ పై మంగళవారం అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం నందు తణుకు వ్యవసాయ సబ్ డివిజన్, సహాయ వ్యవసాయ సంచాలకులు జి. నరేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ 2025 సీజనకు గాను ప్రభుత్వ మద్దతు ధర వరి గ్రేడ్ ఎ రకమునకు క్వింటాలకు-2389రూ. అదేవిధంగా కామన్ వరి రకమునకు -2369 రూ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా MTU -7029,MTU-1318, PLA -1100 వంటి రకాలు కామన్ రకములుగా పరిగణించబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతు సోదరులందరు తాము వేసిన పంటను తప్పనిసరిగా గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పంట నందు నమోదు చేసుకొని ఈ-కేవైసి చెయించుకోవాలని, అదేవిధంగా ఈ-కేవైసి నందు వేలిముద్ర వేసేటప్పుడు ప్రతి రైతు ఈ-క్రాప్ పోర్టల్ నందు తమ యొక్క పంట విస్తీర్ణమును సరిచూసుకోనవలేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తేతలి వీఅర్వో మురళి, వి.ఎ.ఎ. అయ్యప్ప, మల్లికార్జున్, విజయలతోపాటు గ్రామ పెద్దలు, రైతు సోదరులు పాల్గొన్నారు.


