మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి

ఐటీ ప్రొఫెషనల్‌ ఆరిమిల్లి కృష్ణ తులసి

తణుకులో మహిళా సాధికారతపై అవగాహన
మహిళా సాధికారత కేవలం ఆర్థిక స్వావలంబన మాత్రమే కాదని ఆత్మవిశ్వాసంతోపాటు నిర్ణయాధికారం పొందడమని సింగపూర్‌ ఐటీ ప్రొఫెషనల్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి ఆరిమిల్లి కృష్ణతులసి అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కెరీర్‌ గైడెన్స్‌ కమిటీ, మానవత సంయుక్త ఆధ్వర్యంలో తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత అనే అంశంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్యఅతిధిగా కృష్ణ తులసి పాల్గొని మాట్లాడారు. విద్యతోనే మహిళలు కుటుంబం, సమాజం, దేశాన్ని వెలుగులోకి నడిపించగలరని అన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. హింస, వివక్ష తొలగించేందుకు యువతలో చైతన్యం కల్పించాలని కోరారు. విద్యార్థులు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని, ప్రతి రంగంలో ప్రతిభను చూపించాలని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్‌ సీహెచ్‌ ఏడుకొండలు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించారు. అనంతరం కృష్ణతులసిను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ కె.రాధాపుష్పావతి, కె.వెంకట సూర్యనారాయణ, గమిని రాంబాబు, బోయపాటి రామలక్ష్మి, మానవత అధ్యక్షులు కె.రాజ రాజేశ్వరరావు, కెరీర్‌ గైడెన్స్‌ సెల్‌ జిల్లా కన్వీనర్‌ కె.శారదా దేవి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ యమ్‌.రత్న కుమారి, కళాశాల మహిళా సాధికారత విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ పి.కమల, కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ఆర్‌. కె. ఫణిధర్, ఆర్‌. ఎస్‌. ఎం. భూపాల్, ఎ.మారుతీ దేవి చౌదరి, డాక్టర్‌ డి.కనకమహాలక్ష్మి, డాక్టర్‌ ఐ.వి.నారాయణ, పి.చాముండేశ్వరీ దేవి, డాక్టర్‌ జి.విజయ్‌ కుమార్, బి.ఎస్‌.ఎల్‌. పద్మశ్రీ, డాక్టర్‌ టి.సంధ్యారాణి, ఎన్‌.విష్ణువర్ధన్, కె.జీవన్‌ బాబు, వి.శివ ప్రకాష్, జి.కమల ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link