అయోధ్య శ్రీరాముని సేవలో తరిస్తున్న శ్రీ చల్లా శ్రీనివాస శర్మ నిర్మించి తలపెట్టిన కళ్యాణ రాముని ఆలయానికి సంబంధించిన ఉత్సవమూర్తిని అలాగే స్వామివారి కోదండo, పాదుకల్ని తీసుకొని ఆ పూజ పీఠాధిపతుల ఆశీర్వాదం తీసుకొని చేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బిజేపి అధికారప్రతినిధి ముళ్ళపూడి రేణుక. ఈ సందర్భంగా తణుకులో జరిగిన బ్రాహ్మణ సేవా సంఘంలో జరిగిన భక్తులకు సందర్శనార్థం స్వామివారి ఉత్సవమూర్తిని కొదండాన్ని, రామపాదుకలను ప్రజల సందర్శనార్ధం ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ ఎంతో భక్తిశ్రద్దలతో శ్రీ రాములవారికి సమర్పణకు కృషి చేస్తున్న చల్లా శర్మ అభినందనీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు సీతారాం, ట్రెజరర్ బాబు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్, బలిజేపల్లి ఫణి రవిశంకర్, మంత్రిరావు వెంకటరత్నం, పెమ్మరాజు కిరణ్ కుమార్, కార్యదర్శి పేరయ్య శాస్త్రి, RSS సంఘ్ చాలకులు మద్దిపాటి రాజశేఖర్, సత్తిరాజు సుబ్రహ్మణ్యం, బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


