గంజాయి అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా డ్రోన్ నిఘా – చెక్‌పోస్ట్ సిబ్బందికి అప్రమత్తం సూచనలు చేసిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్
సెప్టెంబర్ 22: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా నిరోధానికి అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో, అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి తాటిపర్తి పోలీస్ చెక్‌పోస్ట్‌ను సందర్శించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదే విధంగా గొలుగొండ పోలీస్ స్టేషన్ ఎస్సై ఎం.రామరావు గారు భీమవరం చెక్‌పోస్ట్‌లో గంజాయి రవాణా నిరోధక చర్యలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా చెక్‌పోస్ట్ సిబ్బందికి ప్రతి వాహనంపై సమగ్ర తనిఖీలు నిర్వహించాలని, అనుమానాస్పద కదలికలపై నిశితంగా నిఘా పెట్టాలని సూచించారు. అదనంగా, అక్రమ రవాణా మార్గాలను గుర్తించేందుకు డ్రోన్ సర్వైలెన్స్‌ను వినియోగించాలని జిల్లా ఎస్పీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాలను కఠినంగా అరికట్టి, ప్రజల భద్రతను కాపాడడమే తమ ప్రధాన ధ్యేయమని తెలిపారు.


