తూర్పుగోదావరిజిల్లా ఎస్పీ ఆదేశముల ప్రకారం, కొవ్వూరు డిఎస్పీ, నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో, ఉండ్రాజవరం మండల పరిధిలోని ప్రజలకు పొలీసు శాఖ ఈ విదంగా తెలియజెస్తున్నారు, మండలంలో దొంగతనాలు జరుగుచున్నందున, దసరా పండుగలు నిమిత్తం ప్రజలు బంధువులు ఇళ్ళకు, వారి స్వంత వూళ్లకు వెళ్ళుచున్నప్పుడు, విలువైన బంగారం, వెండి ఆభరణములు, డబ్బును బ్యాంకు లాకర్లలో గాని, బంధువుల వద్ద గాని భద్రపర్చుకుని వెళ్లవలసినదిగా, అదేవిదంగా ఇంటి గేటు తాళములు బయట కాకుండా లోపల వేసుకోవాల్సినదిగా తెలియజేస్తున్నారు. అదే విధంగా గ్రామంలో కొత్తవారు, అనుమానితులు సంచరిస్తున్నా, ఊరు వెళితే ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ నందు తెలియపరచవలెనని సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.


