తణుకు నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు

తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నిధులతో ఇరగవరం మండలం అనుమాజిపాలెం నుంచి వయా పెద్దిరెడ్డి పాలెం మీదుగా కంతేరు వరకు రూ. 45 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇరగవరం మండలం రేలంగి శివారు చుక్కావారితోట గ్రామం వరకు రూ. 30 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. తణుకు మండలం మండపాక శివారు యర్రనీలిగుంట నుంచి అత్తిలి మండలం వరిఘేడు వరకు రూ. 65 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలతో నిర్ణీత సమయంలో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

Scroll to Top
Share via
Copy link