నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారికి అండగా కూటమి
తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్
ప్రసంశించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
నేపాల్‌లో నెలకొన్న పరిణామాలు నేపథ్యంలో అక్కడ జరుగుతున్న అల్లర్లలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న 215 మంది తెలుగువారిని స్వస్థలాలకు తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ స్పందించిన తీరును తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రశంసించారు. నేపాల్ మారణహోమంలో తెలుగువారు ఉన్నారనే విషయం తెలియగానే అనంతపురం పర్యటన రద్దు చేసుకున్న మంత్రి లోకేష్ సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ వార్ రూంను కమాండ్ కంట్రోల్ రూంగా మార్చి సహాయక చర్యలను వేగవంతం చేశారని చెప్పారు. బాధితులతో మాట్లాడి వారు ఎక్కడెక్కడ ఉన్నారో లొకేషన్ కోఆర్డినేట్లతో సహా మ్యాప్ సిద్ధం చేశారన్నారు. మానవీయ స్పందనతోపాటు తమ ప్రజల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను లోకేష్ మరోసారి చాటి చెప్పారని గుర్తు చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అత్యవసర హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడం, అక్కడే చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం, తాగునీరు, వసతి సదుపాయాలు కల్పించేలా చేశారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఎప్పుడు ఎక్కడ ఆపద వచ్చినా ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందన్న విషయం నారా లోకేష్ ద్వారా మరోసారి స్పష్టమైందని ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పష్టం చేశారు.


