స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ వారి ఆదేశాలు మేరకు ప్రజలందరికి ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన చికిత్స పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ఈనెల అనగా సెప్టెంబర్ 17 వ తేదీ నుండి అక్టోబర్ 2 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుపరచుటకు చర్యలు చేపట్టడం జరుగుతున్నది.
అందులో భాగంగా
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలు( హెల్త్ క్లినిక్ లు) ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు,పట్టణ ఆరోగ్య కేంద్రాలు,సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మరియు ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలు, మరియు జిల్లా మరియు వైద్య కళాశాల ఆసుపత్రులు అధ్వర్యంలో ప్రత్యేక వైద్య నిపుణులు సహకారం తో
మహిళలు మరియు పిల్లల కేంద్రీకృత ఆరోగ్య శిబిరాలు నిర్వహణ స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని తెలిపారు.
జిల్లా లోని వైద్యుల సహకారం తో వైద్య కళాశాలలు, జిల్లా ఆసుపత్రులు (డి.హెచ్) నుండి ప్రత్యేక సేవలను అందించాలి.
ప్రైవేట్ ఆసుపత్రులు మరియు క్లినిక్‌లు కూడా ఇలాంటి ఆరోగ్య శిబిరాలను నిర్వహించడానికి ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
మహిళల ఆరోగ్యంపై దృష్టి సారించడం ద్వారా
స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ – సేవల సంతృప్తత పై ఆధారపడి ఉంటుంది.

దీనిలో భాగంగా

  1. యన్.సి.డి స్క్రీనింగ్
  2. క్యాన్సర్ స్క్రీనింగ్
  3. ప్రసూతి సంరక్షణ (ఏ.ఏన్.సి) మరియు తల్లి మరియు పిల్లల రక్షణ (యం.సి.పి) కార్డ్
  4. ఇమ్యునైజేషన్
  5. రక్తహీనత స్క్రీనింగ్ మరియు ఋతు పరిశుభ్రత
  6. ఏ.బి-పి.యం.జె.ఏ.వై/వే వందన కార్డ్/ఏ.బి.డి.యం
  7. పోషన్ (మహిళలు మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహణ)
  8. రక్తదానం
  9. టి.బి స్క్రీనింగ్
  10. మహిళల ద్వారా/కోసం హెల్త్ టెక్ స్టార్టప్‌లు
  11. ఆయుష్ సేవలు
    యన్.సి.డి ల కోసం మహిళల స్క్రీనింగ్ అధిక రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ & గర్భాశయ క్యాన్సర్ మరియు
    అనారోగ్య మహిళలకు క్షయవ్యాధి స్క్రీనింగ్;
    కౌమారదశలో ఉన్న బాలికలు & మహిళలకు రక్తహీనత కోసం స్క్రీనింగ్ మరియు కౌన్సెలింగ్ సేవలు
    గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు సికిల్ సెల్ స్క్రీనింగ్ కార్డుల పంపిణీ మరియు కౌన్సెలింగ్ సేవలు
  12. గర్భిణీ స్త్రీలకు హిమోగ్లోబిన్ స్థాయి పరీక్ష,
  13. గర్భధారణ సమయంలో పోషకాహారం & సంరక్షణపై కౌన్సెలింగ్ మరియు తల్లి మరియు శిశు రక్షణ (యం.సి.పి) కార్డుల పంపిణీతో సహా జనన పూర్వ సంరక్షణ (గర్భిణీ) (ఏ.ఏన్.సి) తనిఖీలు.,
  14. పిల్లలకు రోగనిరోధక సేవలు అందించబడతాయి
  15. కౌమారదశలో ఉన్న బాలికలకు రుతు పరిశుభ్రత మరియు పోషకాహారంపై అవగాహన సమావేశాలు
  16. మహిళా స్వయం సహాయక బృందాలు (యస్.హెచ్.జి) మరియు పంచాయతీ రాజ్ సంస్థల (పి.ఆర్.ఐ) మహిళా ప్రతినిధుల ద్వారా నూనె మరియు చక్కెర వినియోగాన్ని తగ్గించడంపై ప్రచారం
  17. పోషకాహార కౌన్సెలింగ్ మరియు వెల్నెస్ సెషన్లు
  18. రక్తదాన కార్యక్రమం నిర్వహించడం.,పి.యం.జె.ఏ.వై
  19. క్రింద నమోదు/ఆయుష్మాన్ వయె వందన కార్డు పంపిణీ
  20. నిక్షయ్ మిత్ర వాలంటీర్ల నమోదు
  21. వంటి సేవలు అందుబాటులో ఉంచడం ద్వారా ఈ శిబిరాలలో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
  22. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులను ప్రైవేటు వైద్య నిపుణులను భాగస్వామ్యం చేయుట ద్వారా కార్యక్రమాలను విజయవంతం చేయుటకు తగు చర్యలు తీసుకోవడమైనది.
  23. ఈ కార్యక్రమంలో స్త్రీలకు పిల్లలకు అన్ని రకాలైన వైద్య సేవలు అందించడం ద్వారా చర్యలు తీసుకోవడం జరిగినది
  24. ఈ అవకాశాన్ని ప్రజలంతా వినియెగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి తెలిపారు.

Scroll to Top
Share via
Copy link