అధిక మోతాదులో యూరియా వాడకం అనర్ధదాయకం

డిఆర్డిఏ ఆధ్వర్యంలో గ్రామ సంఘాలలో పనిచేస్తున్న మహిళలకు అధిక మోతాదులో యూరియా వాడకంపై కలిగే అనర్ధాలు గురించి మండల వ్యవసాయ అధికారి బి. రాజారావు అవగాహన కార్యక్రమాన్ని స్థానిక వెలుగు కార్యాలయంలో తహసీల్దార్ పి.న్.డి.ప్రసాద్ అధ్యక్షత న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో స్వయం సహాయక సంఘాల లో ఉన్న మహిళలు ద్వారా రైతులకు అధిక యూరియా వాడడం వల్ల కలిగే అనర్ధాలు గురించి వివరంగా తెలియపరచాలని రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా అవసరం మేర మాత్రమే రసాయనిక, సేంద్రీయ మరియు జీవన ఎరువులను వినియోగించాలని తద్వారా నేల ఆరోగ్యం సమతుల్యం అవ్వడంతో పాటు నేల, జల,వాయు కాలుష్యాలు తగ్గడంతో పాటు రైతుకు పెట్టుబడి కూడా తక్కువ అవుతుంది అని ముఖ్యంగా తక్కువ ధరకు వస్తోంది అనే కారణం చేత రైతులు పరిమితికి మించి యూరియాను వినియోగించడం వల్ల పైరు అధికంగా పెరిగి చీడపీడలకు లోను అవుతుందని మరల వాటిని నియంత్రించడం కోసం రసాయనిక పురుగు మరియు తెగులు మందులను వినియోగించవలసి వస్తుందని దానివల్ల రైతుకు అధనంగా ఖర్చు అవుతుంది అని తద్వారా రైతుకు ఆర్థిక భారం పెరుగుతుంది అని రైతులకు మహిళల ద్వారా అవగాహన కల్పించి యూరియాకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి జీవన ఎరువులు మరియు నానో ఎరువులు వాడకాన్ని పెంచేలా ప్రతి ఒక్క మహిళ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయా కంపెనీలను బట్టి యూరియా బస్తా పై కేంద్ర ప్రభుత్వం సుమారుగా 1800 రూపాయలు రాయితీ ఇస్తుందని దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం పెరుగుతుంది అని రైతులు కాంప్లెక్స్ ఎరువులు ధరలు ఎక్కువగా ఉంటుంది అనే ఉద్యేశ్యం తో కాంప్లెక్స్ ఎరువుల వినియోగాన్ని తగ్గించి యూరియా వినియోగాన్ని పెంచుతున్నారని దీనివలన పైరుకు కావలసిన ఇతర పోషకాలు కావలసినంత మోతాదులో లభ్యం కాక పైరు దిగుబడులు తగ్గే అవకాశం ఉందని తెలిపారు . కార్యక్రమంలోడి ఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎమ్ . వి.ఎస్ఎస్.మూర్తి, ఏపిఎం బాలకోటయ్య, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు పాల్గొన్నారు.

తదుపరి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని చివటం మరియు వడ్లూరు గ్రామాల్లో బి రాజారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. VAA లు జగదీశ్వరి వెంకన్న పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link