విశాఖపట్నం: సెప్టెంబర్ 9 (కోస్టల్ న్యూస్)
మెడికవర్ హాస్పిటల్స్, ఎంవిపి కాలనీ, విశాఖపట్నంలో “యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్” ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ కోన శ్రికర్ భారత్ చీఫ్ గెస్ట్‌గా, డా.ఎం.సృజనదేవి (మెడికల్ సూపరింటెండెంట్ & కన్సల్టెంట్ అనేస్తేసిలోజిస్ట్, మెడికవర్ వుమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, మిస్ వైజాగ్ 2025) గెస్ట్ ఆఫ్ ఆనర్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రికెటర్ కోన శ్రికర్ భారత్ మాట్లాడుతూ “ఆరోగ్యమే అసలైన సంపద అని క్రీడాకారులకే కాదు, ప్రతి యువకుడూ క్రమం తప్పకుండా హృదయ పరీక్షలు చేయించుకోవాలి అని ఇటువంటి ప్రోగ్రాములు యువతను ఆరోగ్యవంతమైన భవిష్యత్తు వైపు తీసుకువెళ్తాయి” అని అన్నారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ డా. ఎం. సృజన దేవి (మిస్ విశాఖ 2025) మాట్లాడుతూ “ప్రస్తుతం యువతలో లైఫ్ స్టైల్ సమస్యలు అధికమవుతున్నాయి. హృదయ సంబంధిత వ్యాధులను అరికట్టాలంటే ఆరోగ్యంపై మరింత అవగాహన పెంపొందించుకోవాలి. మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభించిన యంగ్ హార్ట్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ సమాజానికి ఎంతో ఉపయోగకరం” అని అన్నారు. ఈ సందర్భంగా డా. హెమంత్ బెహ్రా, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ “ఇటీవలి కాలంలో 30 ఏళ్ల లోపు వయసులోనే హార్ట్ ఎటాక్స్ పెరుగుతున్నాయి. తగిన ఆహారం, వ్యాయామం, ఒత్తిడిని నియంత్రించడం, అలాగే క్రమం తప్పకుండా హృదయ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ సమస్యలను నివారించవచ్చు. ఈ ప్రోగ్రామ్ ద్వారా యువతలో ముందస్తు నిర్ధారణకు అవకాశముంటుంది” అని వివరించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్రోగ్రామ్‌లో ఈసీజీ, 2డి ఎకో, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ టెస్ట్‌లు మరియు కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ లాంటి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ సీబీఒ మహేష్ దేగ్లూర్కర్, ఏపీ రీజినల్ డైరెక్టర్ ఎన్. పద్మజ, సెంటర్ హెడ్ డా. అరుణ్ కుమార్, మాట్లాడుతూ “సమాజంలో హృదయ వ్యాధులపై అవగాహన కల్పించడం, ముఖ్యంగా యువత ఆరోగ్య రక్షణ మా ప్రధాన లక్ష్యం. ఇలాంటి ప్రోగ్రామ్‌లు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన జీవన శైలి అందిస్తాయి” అని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అతిథులు, వైద్యులు, సిబ్బంది మరియు పాల్గొన్న వారందరికీ ఆసుపత్రి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.


