ప్రతి సన్నివేశం గూస్ బంప్స్ రప్పిస్తాయి
విశాఖపట్నం: సెప్టెంబర్ 9 (కోస్టల్ న్యూస్)
టాలెంటెడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విశాఖలోని ఒక ప్రైవేటు హోటల్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ అంటే నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం కూల్ సిటీ డెవలపడ్ సిటీ అందరికి ఇష్టమైన విశాఖకు వచ్చి ప్రమోట్ చేయడం చాలా ఆనందంగా వుందన్నారు. ఈ కంటెంట్ మీద చాలా నమ్మకం ఉందనీ చాలా హారర్ సినిమాలు చూస్తుంటారు. కానీ కిష్కింధపురి చాలా ప్రత్యేకం అన్నారు. ఇప్పటివరకు ఇలాంటి హారర్ సినిమా రాలేదు. కాన్సెప్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాము. ట్విస్టులు, షాక్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి ఈ సినిమా లో అన్నారు. మాకు మిరాయ్ తో పోటీ లేదు. ముందు మేమే రిలీజ్ డేట్ ముందు ఇచ్చాం సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాల్ని హిట్ చేస్తారన్నారు. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాత సాహు నిర్మించారనీ నిజమైన హంటింగ్ హౌస్ లో దీన్ని సూట్ చేసామని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా వచ్చాయనీ. ఆడియన్స్ ఒక బెస్ట్ హారర్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారన్నారు. దర్శకుడు కౌశిక్ పెగల్పాటి మాట్లాడుతూ ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయనీ ‘కిష్కింధపురి’ తెలుగు బెస్ట్ హారర్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది. మీ అంచనాలను అందుకుంటుంది అన్నారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించారని నేను ఏదైతే కథ అనుకున్నాను దానికి మంచి అవుట్ అవుతుందని కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలవ పోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


