మిరాయ్ పండగ లాంటి సినిమా, టీజర్ ట్రైలర్ అద్భుతంగా వున్నాయి: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో తేజ సజ్జ

విశాఖపట్నం: సెప్టెంబర్ 8

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ ‘మిరాయ్‌’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ విశాఖలోనీ గోకుల్ పార్క్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో తేజా సజ్జా మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ నమస్కారం మా కోసం ఎక్కడ ఎక్కడినుండి ప్రేక్షకులు వచ్చినందుకు చాలా థాంక్స్ మీ ప్రేమను నిలబెట్టుకోవడానికి ఎంత కష్టమైనా పడతాను మీ ప్రేమ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. మిరాయ్ యాక్షన్ అడ్వెంచర్స్ ఫాంటసీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫిల్మ్ పిల్లలు పెద్దలు అందరూ కలిసి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయిదగ్గర సినిమా అందరూ తప్పకుండా థియేటర్స్ కి రండి. చాలా బిగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం అన్నారు. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సెప్టెంబర్ 12న ఒక పండగ లాంటి మిరాయ్ సినిమా విడుదలవుతుంది. చాలా అద్భుతమైన నటీనటులు టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పని చేశారు. తేజ, మంచు మనోజ్, జగపతిబాబు, జయరాం డైరెక్టర్ కార్తిక్ టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ విశ్వప్రసాద్ చాలా పాషనేట్ ప్రొడ్యూసర్ ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. తేజ చేసిన హనుమాన్ సినిమా నాకు చాలా ఇష్టం తప్పకుండా ఈ సినిమాని ప్రేక్షకులందరూ చూసి గొప్పగా ఆదరిస్తారని కోరుకుంటున్నానన్నారు. నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతు అందరికీ నమస్కారం మీ అందరి సపోర్ట్ కి ధన్యవాదాలు. మిరాయ్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసాం. చాలా లార్జ్ స్కేల్లో తీసిన సినిమా ఇది మీ అందరిని అలరిస్తామని నమ్మకం ఉంది సెప్టెంబర్ 12న అందరూ థియేటర్స్ కి వచ్చి ఈ మిరాయ్ ఎక్స్ పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాను.

Scroll to Top
Share via
Copy link