ఉత్తమ ఉపాధ్యాయురాలికి గ్రామస్తుల అభినందన

నిడదవోలునియోజకవర్గం, ఉండ్రాజవరం మండలం, కాల్డరి గ్రామ నెం:3 పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి పులి కుసుమ, జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు.

జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి చేతులమీదుగా గురుపూజోత్సవ దినోత్సవం సందర్భంగా  రాజమహేంద్రవరంలో నిర్వహించిన అవార్డుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బహుకరణ. ఈ సందర్భంగా SMC కమిటీ వారు కాల్దరి గ్రామంలోని పెద్దల సమక్షంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ ప్రెసిడెంట్ శ్రీమతి చీపుళ్ళ కుమారి, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు కోమట్లపల్లి వెంకట సుబ్బారావు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ, గ్రామ ఉప సర్పంచ్ ఈర్పిన సత్యనారాయణ , కాల్దరి సొసైటీ ప్రెసిడెంట్ కోమట్లపల్లి రామదాసు, మండల నాయకులు చీలి బుజ్జిబాబు , గ్రామ నాయకులు కోమట్లపల్లి విశ్వనాధం, SMC చైర్ పర్సన్ కోరుమిల్లి నాగమణి ,గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. ఆమెకు జిల్లా స్థాయిలో అవార్డు అందుకోవడం మండలానికి మరియు గ్రామానికి గుర్తింపు నిస్తుందని విచ్ఛేసిన ప్రతినిధులు ఈ సందర్భంగా అభినందించారు.

Scroll to Top
Share via
Copy link