నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, నిడదవోలు పట్టణ మండలం అధ్యక్షులు, పట్టణ కౌన్సిలర్లు, పెరవలి ఎంపీపీ, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అన్నదాత పోరు పోస్టర్ ను విడుదల చేయండి జరిగింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో 9వ తేదీ మంగళవారం రోజున ఉదయం 09.30 గంటలకు రైతులను దగాచేస్తున్న, కూటమిసర్కార్ పై నిరసన తెలుపుతూ, అన్నదాత పోరు రైతన్నకు బాసటగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున, రైతుల సమస్యల పరిష్కారానికి, రైతులతో కలిసి నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం దగ్గర నుండి, కొవ్వూరు ఆర్డిఓ ఆఫీస్ కు, వెళ్లి కొవ్వూరు ఆర్డిఓ కి వినతిపత్రం అందజేయడం జరుగుతుంది.


