ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో శనివారం విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకార కార్యక్రమం దుర్గమ్మ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు ఈడుబగంటి ఉదయభాను, జనసేన పార్టీ అధ్యక్షులు వసంతవాడ ఫణీంద్ర కుమార్, ఇరగవరం ఎంపీడీవో ఆముదాలపల్లి శ్రీనివాసరావు, తణుకు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మందరపు మనోహర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీలో అధ్యక్షులుగా మంకు దుర్గారావు ఉపాధ్యక్షునిగా సున్నం దుర్గారావు కార్యదర్శిగా గన్నవరపు శ్రీ వీరాచార్యులు సంయుక్త కార్యదర్శిగా వసంతవాడ ఫణీంద్ర కుమార్, కోశాధికారిగా మేడూరి మధు శేఖర్, కోశాధికారిగా సున్నం జగదీష్ సంఘ ప్రధాన సలహాదారులుగా మేడూరి జానకి రామయ్య గోకవరపు ప్రసాదరావు ఉప సలహాదారుడు కోరుమిల్లి శ్రీరామారావు తో పాటు కార్యవర్గ సభ్యులుగా 13 మంది ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాసరావు సబికులను ఉద్దేశించి మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘ భవనానికి గ్రామంలో కేటాయించిన స్థలంలో కమిటీ హాల్ నిర్మాణానికి పంచాయతీలో తీర్మానం చేయించేలా సహకరిస్తానని అన్నారు.


