90 శాతం హామలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం

పుట్టపర్తిలో పేర్కొన్న తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ

ఈనెల 10న సూపర్‌ సిక్స్‌ సూపర్‌ సిక్స్‌ పరిశీలకులుగా ఆరిమిల్లి
కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఈనెల 10న జరగనున్న సూపర్‌ సిక్స్, సూపర్‌ హిట్‌ స్త్రీ శక్తి కార్యక్రమం ఏర్పాట్లకు సంబంధించి పుట్టపర్తి నియోకజవర్గ పరిశీలకులుగా ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేసిందని ఈ క్రమంలోనే స్త్రీశక్తి పథకాన్ని అమలు చేసిందన్నారు. అంతేకాకుండా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పథకాన్ని అమలు చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి కుంభకోణాలకు పాల్పడిన జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌లో ఉండి రూ. వేల కోట్లు ప్రజాధనం కొల్లగొట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌ సారథ్యంలో ప్రజా సంక్షేమంతోపాటు అభివృద్ధిని ఏకకాలంలో అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ప్రభాకర్, శాలివాహన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఈశ్వర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link