మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన పలువురు కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్లు

హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి అభినందించిన మంత్రి దుర్గేష్

ఆయా కార్పొరేషన్ ల పటిష్టతకు, తద్వారా ప్రజానీకానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని సూచన

నిడదవోలు: కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇటీవల నిడదవోలు నియోజకవర్గం నుండి నామినేటెడ్ పోస్టులకు నియమితులైన పలువురు డైరెక్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. శనివారం నిడదవోలు క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కందుల దుర్గేష్ ను ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ డైరెక్టర్ వెలగన దుర్గ అనంతలక్ష్మీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ ముంతాజ్ బేగం, అగ్రికల్చరల్ మిషన్ డైరెక్టర్ కోరశిఖ చంద్రమౌళిలు కలిశారు. టీడీపీలో క్రియా శీలకంగా ఉండి కూటమి విజయానికి దోహదపడి పదవులు వరించిన వారిని మంత్రి దుర్గేష్ అభినందించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పదవీలో ఉన్నంత కాలం కళాకారుల సంక్షేమానికి, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీల సంక్షేమానికి, రైతుల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ ఆయా డైరెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా వారు మంత్రి దుర్గేష్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నిడదవోలు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, టీడీపీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link