విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శకులు ఉపాధ్యాయులు

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్

రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం: అజ్ఞాన అంధకారాల నుండి విజ్ఞాన వికాసం వైపు మనిషిని నడిపించే మహోన్నత వ్యక్తి గురువు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం గురుపూజోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం లోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి, భారతరత్న, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులు అర్పించారు. అనంతరం గురువులందరికీ పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసారు. ఈ సందర్భంగా తన పాఠాలు బోధించిన గురువులను మననం చేసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే మార్గదర్శకులు ఉపాధ్యాయులు అని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్ వారి సేవలను కొనియాడారు. నిరంతరం నిర్విరామ కృషితో విద్యా రంగంలో ఉపాధ్యాయులు చేస్తున్న అమూల్యమైన కృషిని ఆయన ప్రశంసించారు.అంకితభావం, త్యాగం, కృషి, నిరంతర శ్రమతో నేటి విద్యార్థులను రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వర్గీయ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరుపుకుంటున్న గురుపూజోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రతి ఒక్క రంగంలో ఒక ఆదర్శనీయమైన వ్యక్తులు ఉంటారని పేర్కొన్నారు. “మిలాద్ ఉల్ నబీ” మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు, డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒకే రోజు రావడం కాకతాళీయం అన్నారు. గురువులను కించపరిచే విధంగా భాష ఉండకూడదు అని పేర్కొన్నారు. సమాజం ఉన్నతంగా ఎదిగేలా ఉపాధ్యాయులు తమ వంతు బాధ్యత తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి దిశలో పయనిస్తోందని
పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం విద్యాసంస్కరణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు.

తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో, ఉపాధ్యాయులు కూడా అంతే ప్రాధాన్యత కలిగివుంటారని మంత్రి దుర్గేష్ అన్నారు. పాఠ్యాంశాల బోధనతో పాటు, జీవన, నైతిక విలువలను బోధిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని కాంక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఒక ఛలోక్తి విసిరారు. గంట కొడితే ప్రసంగం ఆపే వ్యక్తి ఉపాధ్యాయుడు అయితే, గంట కొట్టినా ప్రసంగం ఆపని వ్యక్తులు రాజకీయ నాయకులు అంటూ సభలో నవ్వులు పూయించారు.

Scroll to Top
Share via
Copy link