రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శుక్రవారం తణుకులో వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో మాట్లాడుతూ రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కర్కశముగా వ్యవహరిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి అయిన అచ్చం నాయుడు పట్టించుకోకుండా రైతుల పట్ల హాస్యాస్పదంగా మాట్లాడుతూ వైయస్సార్సీపి ప్రభుత్వంలో రైతుకు విత్తనం నాటే స్థాయి నుండి ధాన్యం చేతికొచ్చే వరకు అన్ని గ్రామంలోనే జరగాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలను గాలికి వదిలేసారని నేడు రాష్ట్రమంతా రైతులకు యూరియా దొరకక అల్లాడిపోతుంటే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, వ్యవసాయశాఖ మంత్రి ఏమి చేస్తున్నారని అన్నారు. నేడు యూరియా దొరకక కౌలు రైతులు మండల కేంద్రాలలో ఎండకుయండి వానకు తడిసి యూరియా కోసం లైన్లో నిలబడితే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చంనాయుడు భోజనాలకు వెళ్ళినప్పుడు మనం బఫ ప్లేట్లలో తినడానికి నిలబడుతున్నాం కదా దానిలో తప్పేముంది అనటం ఎంతో హాస్యాస్పదం అని కారుమూరి అన్నారు. 24 గంటల్లో అమ్మిన ధాన్యానికి డబ్బులు వేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజుకు చాలామంది రైతులకు ధాన్యం డబ్బులు జమ చేయలేదని అన్నారు. వర్షాల వల్ల ముంపుకు గురైన రైతులను ఇన్పుట్ సబ్సిడీతో అదుకోకుండా కనీసం పరామర్శ కూడా చేయలేని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు తమకు రైతులు ప్రజలు ఓట్లు వేయలేదని ఈవీఎంలు వేయటం వల్ల గెలిచాము కనుక వారికి జవాబు దారి కాము అనుకున్నట్లు ఉన్నదని మాజీ మంత్రి కారుమూరి అన్నారు. రైతే వెన్నుముక లాంటి దేశంలో రైతు బాధలను పట్టించుకోకుండా పాలిస్తున్న కూటమి ప్రభుత్వం వారి పట్ల అవహేళనతో మాట్లాడడం దారుణమని అన్నారు. యూరియా వాడడం వల్ల క్యాన్సర్లు వస్తాయని ఏ విధంగా చెబుతున్నారు అటువంటి సందర్భంలో యూరియా ఫ్యాక్టరీలను మూసివేయాలని, వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు, రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయం అంటే పండుగ అనే విధంగా పరిపాలించారని అన్నారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పరిపాలన అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రైతులందరూ గమనించాలని ఎవరు అండగా ఉండి గిట్టుబాటు ధర కల్పించి , ఇన్సూరెన్స్ చేయించి పంట చేతికి రాకుండా పోయిన సందర్భంలో న్యూమరేషన్ ద్వారా ఇన్పుట్ సబ్సిడీని రప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రైతులను నట్టేట ముంచే ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అని అన్నారు. నాదెండ్ల మనోహర్ అధికారంలోకి రాగానే ఎన్నో ప్రగల్బాలు పలికారని, రకరకాల విన్యాసాలు చేశా చేశారని, సీజ్దా షిప్ అన్నారని రైతులకు డబ్బులు చెల్లించకుండా ముఖం చాటేసారని అన్నారు. ఇక్కడ రైతులను పట్టించుకునే ప్రజాప్రతినిధి లేడని, ఆవులను, గేదలను కోయాలి, లిక్కర్ షాపుల్లో దండుకోవాలి, పనికి ఆహార పథకంలో దండుకోవాలి, దోమలు రాకుండా గ్రామాలలో ఫాగింగ్ పేరట చేస్తున్న స్ప్రే కార్యక్రమంలో పంచాయితీల నుండి వసూలు చేయడం దోపిడీకి అంతులేకుండా పోయిందని పేకాటలు, క్లబ్బులు నుండి దోపిడి, ఖాళీ స్థలాల కబ్జా, జిల్లాలో ఉన్న కేంద్ర మంత్రి తనకు గల ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ద్వారా తణుకులో లేహ్యం ఫుడ్ ఫ్యాక్టరీలో కోస్తున్న ఆవులు గేదెల వద ఆపించాలని, కేంద్రమంత్రి అయి ఉండి కంటి చూపుతో చంపేస్తాను అంటూ ఉంటే భయం వేస్తుందని, మీరు ఎంతమందిని కంటిచూపుతో చంపారని కారుమూరి అన్నారు. 90% కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలే చెబుతున్నారని అవినీతి పెరిగి పోయిందని మాజీమంత్రి కారుమూరి అన్నారు. రైతుల పక్షాన నిలబడడానికి వైసిపి నాయకులు కార్యకర్తలు రెవిన్యూ డివిజనల్ అధికారికి వినతిపత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.


