శ్రీ వర చింతామణి గణపతి స్వామివారి కల్యాణ మహోత్సవం

ఉత్సవంలో పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మన్యాల శ్రీనివాస్ దంపతులు

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్)

దక్షిణ నియోజకవర్గం 29 వార్డు అంతోని నగర్ అడివమ్మ సందులో వెంచేసి ఉన్నా శ్రీ వర చింతామణి గణపతి స్వామి వారి కళ్యాణ మహోత్సవములు ఆలయ ప్రధాన ధర్మకర్త విజయమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమమునకు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్న విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మన్యాల శ్రీనివాస్ దంపతులు, మహారాణిపేట సీఐ దివాకర్ పాల్గొన్నారు. శ్రీ వర చింతామణి గణపతి ఆలయం కమిటీ సభ్యులు ముందుగా వంశీకృష్ణ శ్రీనివాస్ కి పూర్ణకుంభం మరియు వేద పండితులకు మంత్రోచ్చారణలు, సన్నాయి మేళాలతో స్వాగతం పలికి అనంతరం శాసనసభ్యులు సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ స్వామి వారి తీర్థప్రసాదాలను ఎమ్మెల్యే కి అందించారు. తదనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో అంగరంగ వైభవంగా, భక్త జన సందోహం మధ్య నిర్వహించే స్వామివారి కల్యాణంలో తనని భాగస్వామ్యం చేసినందుకు చాలా ఆనందంగా భావిస్తున్నానని, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆశీస్సులు భక్తులపై ప్రజలపై ఎల్లప్పుడూ ఉండి అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగా ఈ ఏడాది కూడా శ్రీ స్వామివారి కల్యాణంలో తనని భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపమని, భక్తజనులకు అవసరమయ్యే సేవా కార్యక్రమాలు చేపట్టాలని, దానికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా శ్రీ విఘ్నేశ్వర ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరి పైన ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వర చింతామణి గణపతి ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు, జన సైనికులు, భారీ సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Scroll to Top
Share via
Copy link