విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్)
వినాయక చవితి ఉత్సవాలు సందర్భంగా పెందుర్తి మండలం వి. జుత్తాడ గ్రామంలో ఎన్సీఈఆర్టీ అడిషనల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డీ.కే రెడ్డి, మరియు ఆయన సతీమణి సౌజన్య ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం దిగ్విజయంగా జరుపబడింది సుమారు రెండు వేలమంది పైచిలుకు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ముఖ్య దాతలు ప్రొఫెసర్ డీకే రెడ్డి ఆయన సతీమణి సౌజన్యతో కలిసి స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ముదునూరు కిరణ్ రాజు, స్థానిక సర్పంచ్ సూర్యప్రకాష్, కమిటీ కన్వీనర్ గౌరీస్, ఆర్గనైజేషన్ టీం సభ్యులందరూ ఎంతో ఉత్సాహంగా భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించబడిన ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, జనసేన నాయకులు రాజు గౌడ్ యాత కమిటీ సభ్యులను అభినందించారు. వారి గ్రామంలో నెలకొల్ప దలచిన వినాయక గుడి విషయమై పెద్దల దృష్టికి తీసుకువెళ్లి తగిన సహాయాన్ని అందజేస్తామని యువత ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఉమెన్ వెల్ఫేర్ ట్రెజరర్ సౌజన్య టీం సభ్యులందరికీ అభినందిస్తూ ఇకముందు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటే తమ వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామని చెప్పారు. త్వరలో తలపెడుతున్న వినాయక ఆలయ నిర్మాణ వివరాలు అడిగి తెలుసుకున్నారు.


