గురువులే సమాజ ప్రగతి నిర్దేశకులు

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్)

సమాజ ప్రగతికి గురువులే మార్గ నిర్దేశకులని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు. గురువారం ఇక్కడ అల్లిపురంలో జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో 85 మంది ఉపాధ్యాయులను పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గురు శిష్య సంప్రదాయం మానవజాతికి శ్రీరామరక్షగా నిలుస్తుందన్నారు తాను కూడా నాలుగేళ్లు ఉపాధ్యాయ వృత్తి లో కొనసాగడం
జరిగింది అన్నారు. నేటికీ అది తనకు ఎంతో సంతృప్తి కలిగిస్తుంది అన్నారు అయితే గురువులు పాఠాలతో పాటు వివిధ అంశాలపై విద్యార్థులకు విజ్ఞానం కూడా అందించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దితే వారు ఆయా సందర్భాన్ని బట్టి సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుంది అన్నారు. చాలామంది ప్రమాదాలు జరిగినప్పుడు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని అయితే ఇప్పుడు పోలీసులు, కోర్టులు అంటూ ప్రత్యేకంగా ఇబ్బందులు ఏమీ ఉండవని చట్టంలో కూడా మార్పులు వచ్చాయి అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రాథమిక చికిత్స అందించే విధంగా కూడా విద్యార్థులకు మెరుగులు దిద్దాలన్నారు. గురువులను ఎప్పుడూ పూజిస్తూనే ఉండాలని తల్లిదండ్రుల తర్వాత స్థానం వారిదే అన్నారు విద్యతోనే అపార ఉపాధి అవకాశాలు లభిస్తాయని కాబట్టి ప్రతి ఒక్కరు ఉన్నత విద్యాభ్యాసం సాగించాలంటే గురువులు తోడ్పాటు ఎంతో అవసరం అన్నారు. ఈ సందర్భంగా కందుల అందిస్తున్న సేవలను పోలీస్ కమిషనర్ కొనియాడారు. కార్యక్రమ నిర్వాహకులు కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఏటా కూడా గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం తనకు ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులను నిరంతరం గౌరవిస్తూనే ఉండాలి అన్నారు తాను కూడా చిన్నప్పుడు దుంపలబడిలో చదువుకున్నానని అయితే అప్పటికి ఇప్పటికీ విద్యా విధానంలో చాలా మార్పులు వచ్చాయి అన్నారు. నేటి ప్రభుత్వంలో విద్యార్థులకు ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తున్నారన్నారు. టూ టౌన్ సీఐ ఎర్రమనాయుడు మాట్లాడుతూ విద్యకు ఎల్లలు లేవన్నారు ఇష్టపడి చదువుకుంటే ఎంతో ఉన్న స్థానం అధిరోహించవచ్చునన్నారు. నేటి తరంలో అన్ని విభాగాలకు చెందిన వారు కూడా ఉన్నత విద్యాభ్యాసం సాగించడం అభినందనీయం అన్నారు. సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు డాక్ యార్డ్ కేటీబీ ఆసోసియేషన్ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గురువుల వల్లే భారతదేశం పూర్తిస్థాయిలో అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు నేటి తరంలో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు అత్యంత ప్రశంసనీయమన్నారు. నిత్యం తాము ఉపాధ్యాయులను గౌరవించి, సత్కరిస్తూనే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కెఎన్ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్లు కందుల బద్రీనాథ్, కేదార్నాథ్ శాలివాహన, విజయ్ గౌరీ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link