పెరవలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మంగళవారం ఆశా డే నిర్వహించారు. ఈ సందర్భంగా పెరవలి మండలంలోని అన్ని గ్రామాలను క్షయ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని వైద్య అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ఎస్.వి.ప్రసాద్ పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెరవలి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో క్షయ వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న వారికి పూర్తిగా మందులుతో పాటుగా పోషకాహారం తీసుకునేలా సహకారం అందించాలని ఆశ కార్యకర్తలకు టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వి.ఆశాజ్యోతి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశ నోడల్ ఆఫీసర్ సిహెచ్ మార్తమ్మ , హెచ్ ఎస్ రాజేష్, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


