తణుకు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ముళ్ళపూడి రేణుకకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికారప్రతినిధిగా నియమించబడినతరువాత అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ముళ్ళపూడి రేణుకకు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ పెరవలి మండలం సీనియర్ నాయకులు సింహాద్రి సత్యనారాయణ, పెరవలి మండల అధ్యక్షులు బి.లీలాకృష్ణ, మండల కార్యదర్శి కే.శివప్రసాద్ రాజు, తాటిపర్రు సొసైటీ అధ్యక్షులు కంటిపూడి సూర్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కిన గోపాలకృష్ణ, తాటిపర్రు గ్రామ సర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు, తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.గంగాధర్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ బూరుగుపల్లి వెంకటేశ్వర్లు, కరుటూరు సుబ్బారావు, బోళ్ళ సత్యనారాయణ, బి.హెచ్ఆంజనేయరాజు తదితరులు పాల్గొన్నారు.


