సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో స్థానిక తణుకు అంగన్వాడి కేంద్రం అర్బన్ సెంటర్ ప్రాంగణంలో సినీగేయ రచయిత ఆరుద్ర శతజయంతిని ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షుడు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ సాహిత్య కారణజన్ముడు ఆరుద్ర గీతి మానవత్వానికి జాగృతి అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సన్మాన గ్రహీత కవి సంకు మదన గోపాల్ మాట్లాడుతూ సినీ కవిగా ఆణిముత్యాలు వంటి పాటలు ఎన్నో ఆరుద్ర రాశారని అన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆరుద్ర రచించిన సినీ గీతాలు ఆలపించి ఆహుతులను ఆ కొట్టుకున్నారు ఆరుద్ర శతజయంతి సందర్భంగా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయులు మార్లపూడి దివ్య, పాడిశెట్టి కామేశ్వరి కందుల మనిషా సాయిదుర్గ, సూరిశెట్టి సత్య వరలక్ష్మి, బుర్లే దేవి, పల్లె జయశ్రీ, ఇంటి యోగశ్రీ, కడలి లక్ష్మి, తుమ్మల అక్షర, గాదిరెడ్డి సౌజన్య, మీర్జా సన్న, తుమ్మగంటి సాయికుమార్, తుమ్మ కిరణ్ మట్టా నాగ గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు.


