చంద్రబాబు తొలి సంతకం చేసి 30 ఏళ్లు
అభినందనలు తెలిపిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
మూడు దశాబ్థాల కాలంలో నాలుగు పర్యాయాలు సీఎంగా పని చేసిన చంద్రబాబునాయుడు ఎన్నో సంస్కరణలకు తెర తీశారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృçష్ణ అన్నారు. చంద్రబాబునాయుడు తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. దేశంలోనే సంచలనం సాధించిన ప్రజల వద్దకు పాలన కార్యక్రమంతోపాటు గతంలో ఎప్పుడూ చూడని ప్రజల భాగస్వామ్యంతో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ప్రజా చైతన్యంతో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం, బాలికా విద్యకు ప్రాధాన్యం – మహిళలకు దీపం పథకం,
కులవృత్తులకు గౌరవం– బిసిలకు ఆదరణ పథకం,
ఎస్సీల రక్షణ కోసం పున్నయ్య కమిషన్ సూచనల అమలు వంటి ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టారన్నారు. బిసిలకు, మహిళలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, మైనారిటీలకు సంక్షేమం, భద్రత, ప్రత్యేక పథకాలు, తొలి సారి డ్వాక్రా మహిళా సంఘాల ఏర్పాటు, విద్యుత్ రంగ సంస్కరణల అమలు, ఫలితాల సాధన, ప్రైవేటు రంగంలో తొలి విమానాశ్రయం, టెలికాం సంస్కరణలకు కీలక సూచనలు,
పిపిపి విధానంలో నేషనల్ హైవేస్ కు అంకురార్పణ– గ్రామగ్రామాన రోడ్లు, ఐటీ కి ప్రాధాన్యత –హైటెక్ సిటీ నిర్మాణం చేపట్టారన్నారు. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజ్ లు, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ ల ఏర్పాటు, విజన్ 2020 తో పాలనకు కొత్త రూపు, విద్యా రంగంలో మార్పులు – 1.80 లక్షల టీచర్ల నియామకం–నాలెడ్జ్ ఎకానమీకి నాంది, స్ధానిక టూరిజానికి అత్యంత ప్రాధాన్యం– దేవాలయాల పరిరక్షణ, డిజిటల్ గవర్నెన్స్ తో సేవలు సులభతరం చేశారని రాధాకృష్ణ వెల్లడించారు.


