రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది

పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భరోసా ఇచ్చారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలోని తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలో ముంపునకు గురైన వరి చేలను పరిశీలించిన అనంతరం రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు నియోజవర్గంలో మొత్తం 300 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి అచ్చెంనాయుడుతో పాటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో మాట్లాడి రైతులకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే వెంట పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link