గత ప్రభుత్వ పిచ్చి చేష్టలను అధిగమించిన కూటమి
క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డులు అందుబాటులోకి
రేషన్ వాహనాల ద్వారా బియ్యం స్మగ్లింగ్ చేసిన వైసిపి
తణుకులో స్మార్ట్ రైస్ కార్డులు ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఇకపై రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువులు పారదర్శకంగా పంపిణీ చేయడానికి స్మార్ట్ రైస్ కార్డులు ఉపయోగపడతాయని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం తణుకు మండలం మండపాక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏటీఎం కార్డు తరహాలో ఉండే ఈ స్మార్ట్ రైస్ కార్డులో ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు తెలుస్తాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిచోట తన ఫోటో ఉండాలని కోరుకునేవాడిని అన్నారు. రేషన్ కార్డులతో పాటు పట్టాదారు పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మలను వేయడంతో పాటు గ్రామాల్లో సరిహద్దు రాళ్లపైన ఆయన చిత్రాలు ముద్రించుకున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు, రేషన్ కార్డులపై రాజమద్ర ఉండేవిధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రంగుల పిచ్చితో గత ప్రభుత్వం కాలయాపన చేసింది అని అన్నారు. గత ప్రభుత్వం చేసిన పిచ్చి చేష్టలను అధిగమించి రాష్ట్ర ప్రజల గౌరవం ఉండే విధంగా ఇలాంటి కార్డులను అందుబాటులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఈ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1.40 కుటుంబాలకు ఈ స్మార్ట్ కార్డులను అందించడం జరుగుతుందని చెప్పారు. తణుకు నియోజకవర్గంలో 86 వేల కార్డులను అందించడం జరుగుతుందని వెల్లడించారు. రాబోయే సెప్టెంబర్ నెల నుంచి కొత్త కార్డుల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో బియ్యం పంపిణీ కోసం ప్రవేశపెట్టిన వాహనాలను అక్రమ మార్గం ద్వారా రాసిన బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలించేందుకు వాడుకున్నారని ఆరోపించారు. విదేశాలకు అక్రమ బియ్యం ఎగుమతి చేయడానికి స్థానికంగా వైసిపి నాయకులతో పాటు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఒక భారీ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 9500 వాహనాలను ప్రవేశపెట్టి రూ. 1600 కోట్లు ఖర్చు పెట్టాలని అన్నారు. వాహనాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చి వాటి ద్వారా స్మగ్లింగ్ చేశారని పేర్కొన్నారు. రేషన్ సరుకులను పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో రేషన్ షాపులను పునరుద్ధరించి వాటి ద్వారా ఉదయం, సాయంత్రం సరుకులు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


