వడ్డెరుల నాయకులతో ఆత్మీయ సమావేశం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మంగళవారం వడ్డెర నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వడ్డెరుల సంక్షేమం కోసం చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టంగా వివరించారు.

ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… “ప్రతి వడ్డెర కుటుంబం ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు పొందేలా ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోంది. వడ్డెరుల సంక్షేమం, అభివృద్ధిని ప్రతి దశలో ముందుగా ఉంచడం తెలుగుదేశం పార్టీ ధ్యేయం. వడ్డెరుల అభ్యున్నతే పార్టీ అభివృద్ధి భావజాలానికి ప్రతీక” అని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వడ్డెరుల కోసం గృహాలు, విద్యా వసతులు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక పథకాలు అమలు చేసింది. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చి వడ్డెరుల సమాజాన్ని సామాజిక, ఆర్థికంగా బలోపేతం చేస్తాం” అని తెలిపారు.

Scroll to Top
Share via
Copy link